: లైంగిక వేధింపులు సమాజం పాలిట సైలెంట్ కిల్లర్లు!: ఏంజెలినా జోలీ
లైంగిక వేధింపులు సమాజం పాలిట సైలెంట్ కిల్లర్ లాంటివని ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ అభిప్రాయపడింది. లండన్ లో 'గ్లోబల్ సమ్మిట్ టు ఎండ్ సెక్సువల్ వయొలెన్స్' అనే అంశంపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్బంగా జోలీ మాట్లాడుతూ... అత్యాచారాలు, లైంగిక వేధింపులు వంటివి సమాజంలో చాపకింద నీరులా వ్యాపిస్తాయని పేర్కొంది. ప్రపంచంలో ఏ మూలకెళ్లినా అక్కడ అత్యాచారాలు సైలెంట్ కిల్లర్లుగా కనిపిస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సమాజాన్ని నాశనం చేయడానికి వ్యూహాత్మకంగా చేస్తున్న ప్రయత్నమే అత్యాచారాలకు పాల్పడడమని ఆమె తెలిపారు.