: ఈ-మెయిల్ తో భర్త రెండో పెళ్లిని నిలిపేసిన భార్య


శాంతి వాసన్, సీత ఇద్దరూ శ్రీలంక దేశస్థులు. ఉద్యోగం కోసం ఇద్దరూ కెనడా వచ్చారు. అనుకోకుండా కెనడాలో కలిసిన వీరు పెళ్లి చేసుకున్నారు. ముగ్గురు పిల్లలనూ కన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు పొడచూపాయి. 'నీతో ఇక వేగలేను.. తిరుచ్చిలోని మాజీ ప్రేయసి సంఘమిని పెళ్లి చేసుకుంటా'నంటూ శాంతి వాసన్ చెప్పడంతో 'నన్ను, నా పిల్లలను వదిలి రెండో పెళ్లి ఎలా చేసుకుంటావో నేనూ చూస్తా'నంటూ సీత కూడా అదే లెవెల్లో సమాధానమిచ్చింది. ఆపై భార్యాపిల్లలను కెనడాలోనే వదిలి శ్రీలంక వచ్చేసిన శాంతి వాసన్ ఆ తర్వాత తిరుచ్చి చేరుకుని మాజీ ప్రేయసిని రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. అంతటితో సరిపెట్టుకుని ఉంటే బాగుండేదేమో, కాని సంఘమి తల్లిదండ్రులు తమ ఇంటి వద్ద సంప్రదాయ రీతిలో మళ్లీ పెళ్లి చేయాలని తీర్మానించారు. సమాచారం అందుకున్న కెనడాలోని సీత... శాంతి వాసన్ తనకు చేసిన మోసాన్ని తిరుచ్చి నగర పోలీస్ కమిషనర్ కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. వెనువెంటనే స్పందించిన కమిషనర్ స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. సీతతో సహజీవనం చేశానని, ముగ్గురు పిల్లలు కూడా తమకు ఉన్నారని శాంతి వాసన్ చెప్పడంతో పోలీసులు పెళ్లిని రద్దు చేశారు.

  • Loading...

More Telugu News