: బాబు 'వాకింగ్ ఫ్రెండ్'.. ముఖ్యమంత్రి 'ఫ్లయింగ్ ఫ్రెండ్'
'వయసు మీదపడుతున్న చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేయడం ఎందుకు?' అని ఇటీవల విమర్శించిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆయనను 'వాకింగ్ ఫ్రెండ్' అని ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు స్పందించారు. ప్రజల కష్టాలకు చలించిపోయి పాదయాత్ర చేస్తున్న బాబును విమర్శిస్తోన్న సీఎం, తరచు విమానాల్లో ప్రయాణిస్తుంటాడని, అందుకే ఆయనను 'ఫ్లయింగ్ ఫ్రెండ్' అనవచ్చని చమత్కరించారు.
ఇక హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసిన నేపథ్యంలో.. మంత్రులకు బదులు దొంగలకు ముఖ్యమంత్రి నాయకత్వం వహిస్తున్నట్టుందని ముద్దుకృష్ణమనాయుడు వ్యాఖ్యానించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు కష్టాలతో సతమతమవుతుంటే విద్యుత్ ఛార్జీల పెంపుతో వారిపై పెను భారం మోపారని ఆయన ఆరోపించారు.