: పోలవరం నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం: రాజ్ నాథ్
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మోడీ సర్కార్ కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పోలవరం ఆర్డినెన్సుపై లోక్ సభలో చర్చ సందర్భంగా, ఆయన మాట్లాడారు. పోలవరంను నిర్మించాలనేది గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని చెప్పారు. ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలపాలనేది గత యూపీఏ ప్రభుత్వ నిర్ణయమే అని గుర్తుచేశారు. పోలవరం నిర్మాణంతో గిరిజనులకు అన్యాయం జరగదని... వారికి పునరావాసం కల్పిస్తామని తెలిపారు.