: కొలనులో బస్సు పడి 11 మంది మృతి
చైనాలోని పర్వత ప్రాంతంలో పాఠశాల పిల్లలను తీసుకెళుతున్న మినీ వ్యాన్ ఒకటి అదుపు తప్పి కొలనులో పడిన ఘటనలో 11 మంది చిన్నారులు చనిపోయారు. చనిపోయిన వారిలో ఎనిమిది మంది చిన్నారులు కాగా, మిగిలిన వారు ఇంకా కిండర్ గార్టెన్ (కేజీ) చదువుతున్నవారే. ఈ ఘటనతో స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు. పాఠశాల నుంచి పిల్లలను ఇంటికి తీసుకెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మినీ వ్యాన్ లో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకున్న నేపథ్యంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.