: 18, 19 తేదీల్లో ఏపీ శాసనసభ్యులకు శిక్షణ తరగతులు: కోడెల


శాసనసభ సభ్యులకు ఈ నెల 18, 19 తేదీల్లో రెండు రోజులపాటు శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. సభా వ్యవహారాలపై సభ్యులకు పూర్తి అవగాహన కల్పించేందుకే ఈ తరగతులను నిర్వహిస్తున్నట్లు శుక్రవారం హైదరాబాద్ లో విలేకరులకు చెప్పారు. ఈ తరగతుల్లో సభ్యులకు పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ, సీనియర్ పార్లమెంటేరియన్ నజ్మా హెప్తుల్లాలే కాక రాజ్యాంగ నిపుణులు సుభాష్ కశ్యప్, వినోద్ రాయ్ తదితరులు హాజరు కానున్నారని కోడెల చెప్పారు.

  • Loading...

More Telugu News