: తొలి త్రైమాసికంలో అంచనాలకు మించిన ఇన్ఫోసిస్ నికరలాభం


భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అంచనాలకు మించి ఇన్ఫీ రాణించింది. రూ. 2,677 కోట్ల అంచనాలను తలకిందులు చేస్తూ 21 శాతం వృద్ధితో రూ. 2,886 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. అలాగే, 13.3 శాతం వృద్ధితో రూ. 12,770 కోట్ల ఆదాయాన్ని పొందింది. దీంతో, ఈరోజు స్టాక్ మార్కెట్లో ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

  • Loading...

More Telugu News