: మరికొన్ని విమానాశ్రయాల్లోనూ వీసా సేవలు: చిరంజీవి
దేశంలోని మరికొన్ని విమానాశ్రయాల్లోనూ వీసా సేవలు ప్రారంభిస్తున్నట్టు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తెలిపారు. నేడు హైదరాబాద్ లో జరిగిన అంతర్జాతీయ పర్యాటక సదస్సులో చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విమానాశ్రయాల్లో వీసాలు జారీ చేసే విషయంలో ఆరు దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. ప్రపంచ పర్యాటక సదస్సుపై దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ళ ఘటన ప్రభావం ఉండబోదని చిరంజీవి అభిప్రాయపడ్డారు. విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా.. పర్యాటక రంగ పురోగతితో తీవ్రవాదానికి చెక్ పెట్టవచ్చని తెలిపారు.