: ఈ ఆలయంలో బద్ధ శత్రువులు పూజలందుకుంటారు!


చాలావరకు దేవాలయాల్లో ఒకే దేవుడినో, దేవతనో ఆరాధించడం చూస్తుంటాం. అయితే, ఇందుకు భిన్నంగా ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో ఓ ఆలయంలో ఇద్దరు పురాణ పురుషులను ఆరాధిస్తారు. విశేషమేమిటంటే, వారిద్దరూ బద్ధశత్రువులు! వారిలో ఒకరు హనుమంతుడు కాగా, మరొకరు రావణాసురుడు. నిజంగా విచిత్రమే కదూ! ప్రతి సోమవారం పంచ్ కియ గ్రామవాసులు ఇక్కడ ఆరాధన చేపడతారు. ప్రమిదలు వెలిగించి పూజా క్రతువు నిర్వహిస్తారు. ఈ పూజాదికాలు వీక్షించి, తమ కోర్కెలు ఈడేర్చుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి తండోపతండాలుగా వస్తుంటారు.

  • Loading...

More Telugu News