: మహిళా సంక్షేమానికి రూ.100కోట్లు, సర్దార్ పటేల్ విగ్రహానికి రూ.200 కోట్లు!


ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కలల ప్రాజెక్టు (స్టేట్యు ఆఫ్ యునిటీ ప్రొజెక్ట్) అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణం కోసం అరుణ్ జైట్లీ ఈ బడ్జెట్ లో రూ.200 కోట్లు కేటాయించారు. ఇదే బడ్జెట్ లో మోడీ సర్కార్ మహిళా భద్రతకు రూ.150 కోట్లు, మహిళల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించింది. మహిళా సంక్షేమం, మహిళా రక్షణ కన్నా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఎక్కువ కేటాయించడం పట్ల విపక్ష నాయకులతో పాటు విశ్లేషకులు కూడా పెదవి విరుస్తున్నారు. కోట్లాది ప్రజలు పేదరికంలో మగ్గుతున్న దేశంలో ఓ విగ్రహానికి రూ.200 కోట్లు కేటాయించడం అన్యాయమని విమర్శకులు అంటున్నారు. అయితే, ఈ చర్యను మోఢీ సర్కార్ సమర్థించుకుంది. స్టేట్యు ఆఫ్ యునిటీ ప్రొజెక్ట్ దేశానికి గర్వకారణమైన ప్రొజెక్ట్ అని, స్వాతంత్రోద్యమంలో బ్రిటీష్ సర్కారును గడగడలాడిండంతో పాటు ఆ తర్వాత దేశ సమగ్రతను కాపాడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని భారీగా ఏర్పాటు చేయడం దేశానికి,దేశ ప్రజలకు గర్వకారణమని వారు అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా టూరిజాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా, ఆ ప్రాంతములో ఉన్న గిరిజనులకు కూడా ఉపాదిని కుడా కల్పిస్తామని బీజేపీ సర్కార్ తమ చర్యలను సమర్థించుకుంది. సర్దార్ సరోవర్ డ్యాం కి మూడు కి.మీ. దూరంలో ఉన్న సాదుభేట్ లో 182 మీటర్ల ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహాన్ని గుజరాత్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన విషయం విదితమే.

  • Loading...

More Telugu News