: ఏపీలో 55 మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో సర్కిల్ ఇన్ స్పెక్టర్లుగా విధులు నిర్వర్తిస్తున్న 55 మంది అధికారులకు పదోన్నతి లభించింది. 1989 బ్యాచ్ కు చెందిన 55 మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ డీజీపీ రాముడు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఐ నుంచి డీఎస్పీగా పదోన్నతి పొందేందుకు సుదీర్ఘకాలం వేచి చూడాల్సి వచ్చేది. రాష్ట్ర విభజన తర్వాత తొలి యత్నంలోనే పెద్ద సంఖ్యలో సీఐలకు పదోన్నతి లభించడం గమనార్హం.