: మోడీ సర్కారుపై మండిపడిన లాలూప్రసాద్ యాదవ్
మోడీ సర్కార్ తొలి బడ్జెట్ పై ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ విరుచుకుపడ్డారు. పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు రైతులకు కూడా ఇది పూర్తి వ్యతిరేకమైన బడ్జెట్ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఎఫ్ డీఐ, పీపీపీ (ప్రైవేట్ పబ్లిక్ పార్ట్ నర్ షిప్)ల గురించి తప్ప తనకు బడ్జెట్ లో ఇంకేమీ కనిపించలేదని లాలూ అన్నారు. దేశాన్ని విదేశీ శక్తులకు అప్పచెప్పేందుకు మోడీ సర్కార్ చేసిన తొలి ప్రయత్నమే ఈ బడ్జెట్ అని ఆయన ఎన్డీయే సర్కారును ఎండగట్టారు. బీజేపీ స్లోగన్ అయిన స్వదేశీ నినాదం ఇప్పుడేమయిందని లాలూ బీజేపీ సర్కారుకు చురకలంటించారు.