: రాబడి ఎలా..? దేశ సంపదను అమ్మేస్తారా?: శశి థరూర్
మోడీ సర్కారు బడ్జెట్ పై యూపీఏలో సహాయ మంత్రిగా కొనసాగిన శశి థరూర్ కాస్త విశ్లేషణాత్మక విమర్శలు చేశారు. గురువారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన 2014-15 బడ్జెట్ లో ’పన్నేతర రాబడుల కింద రూ. 99,009 కోట్లను చూపారు. అదే సమయంలో పీఎస్ యూల వాటాల విక్రయంపై మాట మాత్రంగానైనా ప్రస్తావించలేదు. మరి పన్నేతర రాబడుల విభాగంలో రూ. 99, 009 కోట్లను ఎలా రాబడతారు? దేశ సంపదనేమైనా అమ్మడానికి సిద్ధపడుతున్నారా?‘ అంటూ శశి థరూర్ జైట్లీ బడ్జెట్ పై వాగ్బాణాలు సంధించారు.