: జగన్ పై సోమిరెడ్డి ఫైర్
జడ్పీ ఎన్నిక సమయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు దౌర్జన్యం చేశారంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ గవర్నర్ ను, కేంద్ర హోం మంత్రిని కలవడం హాస్యాస్పదమని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసుల విషయంలో ఊరట కోసమే ఢిల్లీ వెళ్ళారని, అందుకు ఎన్నికల్లో అక్రమాలంటూ సాకులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. గీత దాటితే కాళ్ళు, చేతులు నరికేస్తామని వైఎస్సార్సీపీ నేతలే వారి జడ్పీటీసీలను బెదరించారని సోమిరెడ్డి ఆరోపించారు.