: హైదరాబాద్ కుర్రాళ్ళకు అరుదైన అవకాశం
హైదరాబాదుకు చెందిన సిమర్ ప్రీత్ సింగ్, తారిక్ అహ్మద్ లకు అరుదైన అవకాశం లభించింది. వీరిద్దరూ చిలీలో జరిగే స్లమ్ సాకర్ లీగ్ లో పాల్గొనేందుకు ఎంపికయ్యారు. ఈ స్లమ్ సాకర్ లీగ్ ను త్వరలోనే ఫిఫా ఆధ్వర్యంలో చిలీలో నిర్వహించనున్నారు. కాగా, ఈ హైదరాబాదు కుర్రాళ్ళు ప్రస్తుతం స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్ సీఎఫ్) లో శిక్షణ పొందుతున్నారు. సిమర్ ప్రీత్, అహ్మద్ లు స్లమ్ సాకర్ లీగ్ కు ఎంపికయ్యారని ఎస్ సీఎఫ్ వ్యవస్థాపక కార్యదర్శి సాయిబాబా తెలిపారు.