: రాహుల్, వాజ్ పేయి... సేమ్ టు సేమ్ అట..!


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ లో నిద్రపోతున్న దృశ్యాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో రాహుల్ మీద జోకులు, పదునైన వ్యాఖ్యలు చేస్తున్నారు నెటిజెన్లు. అయితే, ఈ విషయంలో రాహుల్ గాంధీ మీద పడిన మచ్చను చెరిపేయడానికి కాంగ్రెస్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. చిన్న విషయాన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా ఆరోపించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి కూడా ఎప్పుడూ కళ్లు మూసుకునే ప్రసంగాలు వినేవారని ఆయన గుర్తు చేశారు. రాహుల్ కూడా వాజ్ పేయి లాగా కళ్లు మూసుకుని ధరల పెరుగుదలపై చర్చను వింటున్నారని రాజీవ్ శుక్లా తమ నేతను వెనకేసుకొచ్చారు.

  • Loading...

More Telugu News