: బడ్జెట్ లో క్రీడలకు పెద్దపీట


ఈసారి కేంద్ర బడ్జెట్లో క్రీడలకు పెద్దపీట వేశారు. దేశంలో క్రీడల శిక్షణకు రూ.100 కోట్లు కేటాయించారు. అంతేగాకుండా, మణిపూర్లో స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేయనున్నట్టు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఇక, తీవ్రవాదంతో అట్టుడికిపోయే జమ్మూకాశ్మీర్లో యువతను పెడత్రోవపట్టనీయకుండా చేసేందుకు మోడీ సర్కారు కృతనిశ్చయంతో ఉన్నట్టు తాజా బడ్జెట్ చెబుతోంది. ఈ మేరకు జమ్మూకాశ్మీర్లో ఇండోర్, అవుట్ డోర్ స్టేడియంల ఆధునికీకరణకు రూ.200 కోట్లు కేటాయించారు.

  • Loading...

More Telugu News