: సబ్బులు,ఎల్ సీడీ,ఎల్ఈడీ టీవీల ధరలు తగ్గుతున్నాయ్... సిగరెట్లపై భారీగా పన్ను


2014-15 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సబ్బులు, ఎల్ సీడీ, ఎల్ఈడీ టీవీలు,మొబైల్ ఫోన్లు, వజ్రాలు, విలువైన రాళ్లు, కంప్యూటర్లు, సిమెంటు ధరలు తగ్గనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించారు. ఇక పెట్రో కెమికల్స్ పై కస్టమ్స్ డ్యూటీ కూడా తగ్గనున్నట్టు చెప్పారు. అటు ఎలక్ట్రానిక్స్ గూడ్స్ పై ఎడ్యుకేషన్ సెస్ విధిస్తున్నట్టు, స్టెయిన్ లెస్ స్టీలు కస్టమ్స్ డ్యూటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ పై ఎక్సైజ్ డ్యూటీ పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఇక సిగరెట్, గుట్కాలు, పాన్ మసాల ధరలు భారీగా పెరగనున్నట్లు వెల్లడించారు. ఇందులో ప్రధానంగా సిగరెట్లపై 11 నుంచి 72 శాతం పన్ను పెంపు విధిస్తున్నట్లు చెప్పారు. దాంతో, పొగరాయుళ్ల జేబులకు పెద్ద చిల్లే పడనుంది.

  • Loading...

More Telugu News