: విజయకాంత్ ఆరోగ్యంపై ఆందోళనలో పార్టీ వర్గాలు
డీఎండీకే అధినేత విజయకాంత్ ఆరోగ్యం పట్ల పార్టీ వర్గాలు ఆందోళనలో మునిగిపోయాయి. చెన్నైలోని తన నివాసంలో బుధవారం ఉదయం విజయకాంత్ కు ఛాతీనొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. స్వల్ప నొప్పే అయినా, ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటీన గ్రీమ్స్ రోడ్డులోని అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. విజయకాంత్ కు అస్వస్థత అన్న వార్తతో పార్టీ వర్గాల్లో కలవరం రేగింది. అయితే, ఆయనకు యాంజియోగ్రాం చేయాలని వైద్యులు నిర్ణయించినట్టు సమాచారం.