: రష్యాలో మరికొంతకాలం ఆశ్రయం ఇవ్వండి: ఎడ్వర్డ్ స్నోడెన్
రష్యాలో ఉండేందుకు తన గడువు సమయం పెంచాలంటూ విజిల్ బ్లోయర్ (ప్రజావేగు) ఎడ్వర్డ్ స్నోడెన్ కోరుతున్నాడు. ఈ మేరకు రష్యా మైగ్రేషన్ అధికారులకు ఆయన దరఖాస్తు చేసుకున్నట్టు అతని లాయర్ అనటోలీ కుచెర్నా తెలిపాడు. గతేడాది నుంచి స్నోడెన్ రష్యాలోనే ఆశ్రయం పొందుతున్నాడు. ఈ నెలతో అతని గడువు కాలం పూర్తవడంతో ఈ క్రమంలోనే కోరినట్లు న్యాయవాది చెప్పాడు. త్వరలోనే దీనిపై మైగ్రేషన్ అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.