: సీఎం కిరణ్ నోట 'మూడు లక్షల' మాట!
రాష్ట్రంలో విపక్షాలన్నీధనికుల కోసమే ధర్నాలు చేస్తున్నాయని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా మడకశిరలో జరిగిన ఓ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో ఉన్న మూడు లక్షల మంది ధనికులకు మేలు చేకూరేందుకే ఈ పార్టీలన్నీవిద్యుత్ అంశంపై ధర్నాలు చేస్తున్నాయని విమర్శించారు. విద్యుత్ ఛార్జీల విషయంలో పేదలపై భారం పడకుండా తాము ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని, అయినా, విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని సీఎం అసహనం వ్యక్తం చేశారు. రూ. 12, 250 కోట్లతో ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ అమలుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, దీన్ని కూడా అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు భారీ ఎత్తున కార్యక్రమాలు చేప్టటేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.