: విదేశాల వీధుల్లో ఫైళ్ళు పట్టుకుతిరిగింది ఇందుకేనా?: చంద్రబాబు ఆక్రోశం


హైదరాబాద్ ను తానెంతగానో అభివృద్ధి చేశానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. 'తెలుగువాళ్ళంతా నా వాళ్ళని భావించి హైదరాబాద్ కోసం ఎంతో కష్టపడ్డా'నని చెప్పారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయా దేశాల వీధుల్లో ఫైళ్ళు పట్టుకు తిరిగానని తెలిపారు. అలాంటిది నేడు హైదరాబాదులోని ఏపీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చేయబోమని ఇక్కడి సర్కారు చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 1956ను స్థానికతకు ప్రామాణికంగా తీసుకోవడం ఏం న్యాయమని బాబు ప్రశ్నించారు. తెలంగాణ నేతల వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని, ఇలాంటి వ్యాఖ్యలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. కాగా, సమస్యల పరిష్కారానికి తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావును చర్చలకు ఆహ్వానిస్తామని బాబు వెల్లడించారు.

  • Loading...

More Telugu News