: పార్లమెంటుకు చేరుకున్న ఆర్థికమంత్రి జైట్లీ
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కాసేపటి క్రితం పార్లమెంటుకు చేరుకున్నారు. ఈ ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ఆయన సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. దేశ ఆర్థిక స్థితిని పట్టాలెక్కించడానికి కఠిన నిర్ణయాలకు సైతం సిద్ధమంటూ మోడీ సర్కార్ ప్రకటించిన నేపథ్యంలో, ఈ బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.