: బెంగళూరులో కడప సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దుర్మరణం


బెంగళూరులో ఏపీకి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రైలు ఢీకొని దుర్మరణం పాలయ్యాడు. కడపకు చెందిన అశోక్ కుమార్ రెడ్డి (28) అనే యువకుడు బుధవారం జాగింగ్ కు వెళ్ళి తిరిగి వచ్చే క్రమంలో రైలు పట్టాలు దాటుతూ మృత్యువాత పడ్డాడు. ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అశోక్ కుమార్ రెడ్డికి ఎనిమిది నెలల క్రితమే వివాహం కాగా, కల్యాణనగరలోని విజయాబ్యాంకు కాలనీలో నివాసముంటున్నాడు. అతడు పట్టాలు దాటే సమయంలో రైలు వస్తున్న విషయం గుర్తించకపోవడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని చెప్పారు.

  • Loading...

More Telugu News