: జీహెచ్ఎంసీ కార్మికుల సమ్మె షురూ... హైదరాబాదులో ఎక్కడి చెత్త అక్కడే


తమ వేతనాలను వెంటనే పెంచాలని కోరుతూ జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, ట్రాన్స్ పోర్ట్ కార్మికులు అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగారు. దీంతో హైదరాబాదులో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. నగరంలో చెత్తను తరలించే 850 వాహనాలు నిలిచిపోయాయి. తమ డిమాండ్లను నెరవేర్చేదాకా సమ్మెను కొనసాగిస్తామని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. ఈ క్రమంలో చెత్త తరలింపుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జోనల్ కమిషనర్లకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News