: సత్తా చాటిన విజయ్... అదరగొట్టిన ధోనీ... తొలిరోజు ఇండియాదే!


ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ శుభారంభం చేసింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. ఓపెనర్ మురళీ విజయ్ 122* (294 బంతులు, 20 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులతో అజేయ సెంచరీ సాధించి సత్తా చాటాడు. అయితే, మరో ఓపెనర్ ధావన్ (12) విఫలమయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా ఇన్నింగ్స్ ను నిర్మించే పనిలో పడ్డప్పటికీ... 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన టీమిండియా యువ సంచలనం కోహ్లీ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. రహానె 32 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఈ సమయంలో విజయ్ కు జతకలిసిన కెప్టెన్ ధోని తనదైన శైలిలో దూకుడుగా ఆడి 64 బంతుల్లో 50* పరుగులు (5 ఫోర్లు) చేశాడు. అభేద్యమైన ఐదో వికెట్ కు విజయ్, ధోనీలు 81 పరుగులు జోడించారు. దీంతో, ఆట తొలిరోజును భారత్ అనుకున్న రీతిలో ముగించింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 2, బ్రాడ్, ప్లంకెట్ చెరో వికెట్ పడగొట్టారు.

  • Loading...

More Telugu News