: బాబ్బాబు...సమ్మెకు దిగకండి!: జీహెచ్ఎంసీ కమిషనర్
కార్మికులు సమ్మెకు దిగవద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ కార్మిక సంఘాలతో చర్చలు విఫలమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రంజాన్ మాసం, మహంకాళీ జాతర, వర్షాకాలం కావడంతో కార్మికులు సమ్మె చేపట్టడం సరికాదని ఆయన సూచించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని ఆయన హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ కార్మికులు సమ్మెకు వెళ్లాలని నిర్ణయిస్తే ఎస్మా ప్రయోగానికి తాము వెనుకాడమని ఆయన హెచ్చరించారు.