: నేటి అర్థరాత్రి నుంచి జీహెచ్ఎంసీ కార్మికుల సమ్మె
నేటి అర్థరాత్రి నుంచి జీహెచ్ఎంసీ కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. వేతనాల పెంపుపై జీహెచ్ఎంసీ వైఖరికి నిరసనగా కార్మికులు సమ్మెకు దిగుతున్నారని బీఎంఎస్ కార్మిక సంఘం నేత శంకర్ తెలిపారు. ఈ మేరకు హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ... జీతాలను 27 శాతం పెంచాలన్న ప్రధాన డిమాండ్ తో సమ్మెకు దిగుతున్నామన్నారు. అలాగే ఐఆర్ పెంపునకు సంబంధించి ప్రభుత్వం హామీ ఇచ్చినా, ఇంతవరకు వాటిని చెల్లించలేదని ఆయన అన్నారు. వీటిని చెల్లించకుండా జీహెచ్ఎంసీ తాత్సారం చేయడంతో, జీహెచ్ఎంసీ పరిథిలోని 7500 మంది కార్మికులు సమ్మెలో పాల్గోనున్నారని ఆయన తెలిపారు. దీంతో హైదరాబాదులో పారిశుద్ధ్య, రవాణా, మలేరియా, పార్కులు, పశువైద్య విభాగాలు స్తంభించనున్నాయి.