: ‘స్మార్ట్ అండ్ సేఫ్ సిటీ’పై కేసీఆర్ సమీక్ష
హైదరాబాదులోని సచివాలయంలో ‘స్మార్ట్ అండ్ సేఫ్ సిటీ’పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో లండన్ పోలీస్ ఉన్నతాధికారితో బాటు, మహారాష్ట్ర మాజీ డీజీపీ శివానందం పాల్గొన్నారు. జీఎంఆర్ ప్రతినిధుల బృందం నగరంలోని భద్రతా ఏర్పాట్లపై కేసీఆర్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వం అంగీకరిస్తే తాము పోలీసులతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని వారు ముఖ్యమంత్రికి తెలిపారు.