: ఈసారి మహంకాళీ జాతరకు ఇద్దరు ముఖ్యమంత్రులు వస్తున్నారు


సికింద్రాబాదులో కొలువైన ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఆషాడ జాతర (బోనాలు)కు ఈసారి ఇద్దరు ముఖ్యమంత్రులు రానున్నారు. ఈసారి జాతరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లకు టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ ఇప్పటికే ఆహ్వానం పంపారు. ప్రతియేటా చంద్రబాబు మహంకాళీ జాతరకు రావడం ఆనవాయతీ అని, ఈసారి కూడా ఆయన బోనాల పండుగకు హాజరవుతారని తలసాని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఈ జాతరలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించనున్నారు. దీంతో ఆదివారం నాడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బోనాల పండుగకు హాజరు కానున్నారు.

  • Loading...

More Telugu News