: ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంస్కరణలతో దేశ స్వరూపం మారిపోయిందని అన్నారు. గత పదేళ్లలో ఆర్థిక రంగం కుదేలైన కారణాలను ఆయన వివరించారు. విభజన వల్ల తలెత్తిన ఇబ్బందులను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశామని చంద్రబాబు చెప్పారు. ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు ముందు, తరువాత పరిస్థితులు మారాయని ఆయన అన్నారు. ఆర్థిక సంస్కరణల తర్వాత వ్యవసాయ రంగంలో గణనీయమైన అభివృద్ధి జరిగిందన్నారు. 2001లో ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని, ఆ ప్రభావం 2007 వరకు కొనసాగిందన్నారు. అవినీతి వల్ల 2009 నుంచి దేశం తిరోగమన దిశగా పయనించిందని ఆయన చెప్పారు. 2001 అక్షరాస్యతా శాతం 16.37 కాగా, ఇప్పుడది 6.3 శాతానికి చేరిందని చంద్రబాబు చెప్పారు. గత పదేళ్లుగా విద్యుత్ రంగాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు.