: ఎన్ఎంయూ నేతలు మహమూద్, నాగేశ్వర్ లపై సస్పెన్షన్ వేటు
ఆర్టీసీ కార్మిక సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) నేతలు మహమూద్, నాగేశ్వర్ లపై సస్పెన్షన్ వేటు పడింది. తిరుపతిలో జరిగిన ఎన్ఎంయూ కేంద్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ప్రతినిధులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సస్పెన్షన్ పై నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముందు మహమూద్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అవినీతి ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేసినట్లు తెలిసింది.