: ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు థాయ్ లాండ్ వ్యాపార ప్రతినిధుల సుముఖత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును లేక్ వ్యూ అతిథిగృహంలో థాయ్ లాండ్ వ్యాపార ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా పలు వ్యాపార విషయాలపై సీఎంతో చర్చించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు వారు ముందుకొచ్చారు. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో కోళ్ల పరిశ్రమ, ఉభయ గోదావరి జిల్లాల్లో చేపలు, రొయ్యల దాణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు.