: ఖమ్మం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ‘గ్రాడ్యుయేషన్ డే’ వేడుకలు
ఖమ్మం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కిట్స్) కాలేజ్ లో ఇవాళ ‘గ్రాడ్యుయేషన్ డే’ను నిర్వహించారు. ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నెకల్లు గ్రామంలో ఉన్న కిట్స్ కాలేజ్ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హైదరాబాదు జేఎన్టీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఏవీఎన్ గుప్తా హాజరై విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ఛైర్మన్ నిరంజన్ రెడ్డి, కరస్పాండెంట్ కోట అప్పిరెడ్డి, ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్, డైరెక్టర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.