: షరతులు లేకుండానే రుణమాఫీ చేయాలి: రఘువీరా


రైతుల రుణమాఫీకి ముందు ఎలాంటి షరతులు విధించరాదని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన టీడీపీ, ఆ తర్వాత రుణమాఫీ నుంచి ఎలా తప్పించుకోవాలా? అంటూ కుంటి సాకులు వెదుకుతోందని ఆయన విమర్శించారు. రైతుల రుణాలను రీషెడ్యూల్ చేస్తామని టీడీపీ సర్కారు చెబుతోందని, దీనివల్ల రైతులపై రూ. 6 వేల కోట్ల మేర భారం పడే ప్రమాదముందన్నారు. అసలు రీషెడ్యూల్ చేస్తే, ఈ దఫా రైతులకు రుణాలిచ్చేందుకు అసలు బ్యాంకుల వద్ద డబ్బు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News