: అక్కడ ఇళ్లు ఎందుకు నిర్మించలేదో కేసీఆర్ కు వివరిస్తాం: అశోక్ బాబు


ఏపీఎన్జీవోలకు కేటాయించిన భూముల్లో ఎందుకు ఇళ్లు నిర్మించలేదో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివరిస్తామని ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఏపీఎన్జీవో భూముల్లో తెలంగాణ ఉద్యోగులు వాటాలు అడుగుతున్నారని అన్నారు. అది పూర్తిగా ప్రైవేటు ఆస్తి అని, అలాంటి దానిలో వాటాలు ఎలా అడుగుతారని ఆయన ప్రశ్నించారు. కాగా, ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి, హైకోర్టు దీనిపై స్టేటస్ కో విధించిన సంగతీ తెలిసిందే.

  • Loading...

More Telugu News