: రాజకీయ దురుద్దేశంతోనే ఐటీ నోటీసులు ఇచ్చారు: సోనియా


నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో ఆదాయపు పన్ను శాఖ తనకు నోటీసులు ఇవ్వడాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తప్పుబట్టారు. రాజకీయ దురుద్దేశంతోనే ఐటీ శాఖ తనకు నోటీసులు ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలతో తాము త్వరగా పుంజుకునే అవకాశం ఉందని, తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యలతో తమను ఎవరూ భయపెట్టలేరని ఆమె పేర్కొన్నారు. ఇదిలావుంటే, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ ఆధారంగా పోయిన నెలలో ఇదే కేసులో సోనియా, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఢిల్లీ స్థానిక కోర్టు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News