: ఫేస్ బుక్ లో గోవా మంత్రి మార్ఫింగ్ ఫోటో కలకలం


సోషల్ మీడియా వెబ్ సైట్ల ప్రభావం కొన్ని విషయాల్లో మితిమీరుతోంది. తాజాగా, గోవా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ మంత్రి సుదిన్ ధవల్కర్ పింక్ బికినీ ధరించినట్టుగా ఆయన ఫోటోను మార్ఫింగ్ చేసి పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో కలకలం రేపుతోంది. ఈ విషయం ప్రభుత్వానికి తెలియడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును సైబర్ సెల్ కు అప్పగించారు. దాంతో, అమెరికాలో ఆ ఫోటోను పోస్టు చేసిన గోవాకు చెందిన సేవియో అల్మెడా అనే వ్యక్తిపై చర్యలు తీసుకోనున్నారు. గోవా బీచుల్లో ఇకనుంచి బికినీలను బ్యాన్ చేయాలని కొన్ని రోజుల కిందట సదరు మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి మార్ఫింగ్ కు పాల్పడినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News