: కర్నూలు జడ్పీ ఎన్నికపై కోర్టుకెళతాం: వైెఎస్సార్సీపీ
కర్నూలు జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో అధికార పక్షం వ్యవహరించిన తీరుపై కోర్టును ఆశ్రయించనున్నట్లు వైఎస్సార్సీపీ నేత మైసూరారెడ్డి ప్రకటించారు. అధికార పార్టీ దౌర్జన్యం చేసి కర్నూలు జిల్లా పరిషత్ అధ్యక్ష పదవిని దక్కించుకుందని ఆయన వ్యాఖ్యానించారు. అధికార పార్టీ నేతలకు అధికారులు కూడా పూర్తిగా సహకరించి, తమకు అన్యాయం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల వ్యవహార సరళిపై బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంతరెడ్డికి పార్టీ ప్రతినిధి బృందంతో కలిసి మైసూరా ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీకి సహకరించిన కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.