: ఎంపీటీసీ సభ్యురాలిపై అత్యాచారయత్నం
సామాన్య మహిళలకే కాదు, చట్టసభలకు ఎన్నికైన మహిళలకూ దేశంలో రక్షణ లేకుండా పోయింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపీటీసీ) సభ్యురాలిగా ఎన్నికైన మహిళపై ఓ కామాంధుడు అత్యాచారయత్నం చేశాడు. అయితే, సదరు మహిళ భర్త కామాంధుడిని అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహించిన ఆ కామాంధుడు మహిళ భర్తపై దాడి చేసి పరారయ్యాడు. విశాఖపట్టణం జిల్లా జి. మాడుగుల మండలం ఊర్లమిట్టలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.