: రాజమండ్రి రైల్వేస్టేషన్ ను సందర్శించిన ద.మ రైల్వే జీఎం
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి రైల్వేస్టేషన్ ను ఈ రోజు దక్షిణమధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ఏడాది నుంచి ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లపై పరిశీలిస్తామన్నారు. పుష్కరాలకు సంబంధించిన పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభిస్తామని చెప్పారు.