: బంగారం మరింత పడుతుంది: నిపుణుల అంచనా


అంతర్జాతీయంగా బంగారం ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, సైప్రస్ సంక్షోభం తదితర కారణాలతో బంగారం మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో అమెరికా మార్కెట్లో శుక్రవారం 4శాతానికి పైగా బంగారం ధరలు పతనమై 2011 జూలై తర్వాత అత్యంత కనిష్ట స్ధాయికి చేరాయి. ఔన్స్ బంగారం ధర 1500 డాలర్ల స్థాయి దిగువకు పడిపోయింది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్ పైనా పడింది. దాంతో ఇక్కడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 కేరట్ల బంగారం ధర ఏకంగా రూ.1300 తగ్గి రూ. 28,150కు దిగొచ్చింది.

వెండి కూడా కిలో ధర రూ. 2,800 తగ్గి 49,700కు చేరుకుంది. బంగారం ధరలు కీలక మద్దతు స్ధాయి కంటే దిగువకు పడిపోయాయని.. దీంతో మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. స్వల్ప కాలంలోనే 24 కేరట్ల బంగారం 10 గ్రాముల ధర 25 వేల వరకూ పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. మరీ అమ్మకాలు వెల్లువెత్తితే 23 వేల వరకూ తగ్గిపోవచ్చని, ప్రస్తుత ధరలలో కొనుగోలు చేయడం కంటే మరికొంత కాలం ఓపిక పట్టాలని సూచిస్తున్నారు. బంగారం ధరలు ప్రస్తుత స్థాయి నుంచి ఇంకా తగ్గడానికి అవకాశం ఉందని.. మార్కెట్ బేరిష్ ట్రెండ్ లోకి ప్రవేశించిందని చెబుతున్నారు. వాస్తవానికి బంగారంతో పాటు వెండి ధరలు తగ్గినప్పటికీ మధ్యకాలంలో వెండి ముందుకే పోవచ్చని నిపుణుల విశ్లేషణ.

  • Loading...

More Telugu News