: నేడు ఇరాక్ నుంచి భారత్ కు మరో 200 మంది రాక


అల్లర్లతో అట్టుడుకుతున్న ఇరాక్ లో చిక్కుకుపోయిన మరో 200 మంది భారతీయులు బుధవారం స్వదేశం చేరుకోనున్నారు. బుధవారం మధ్యాహ్నం 200 మంది భారతీయులతో కూడిన బృందం దేశ రాజధాని ఢిల్లీ చేరుకోనుంది. వీరంతా ఇరాక్ లోని నజాఫ్ నుంచి వస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. వీరి రాకతో ఇరాక్ నుంచి భారత్ కు సురక్షితంగా చేరుకున్న మనవాళ్ళ సంఖ్య 2,300లకు చేరుకుంటుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, వీరంతా ఇరాక్ లోనూ సురక్షిత ప్రదేశంలోనే ఉన్నారని, అక్కడ నెలకొన్న భయానక పరిస్థితుల నేపథ్యంలో స్వదేశానికి వచ్చేందుకు తమను ఆశ్రయించినట్లు ఇరాక్ లో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు.

  • Loading...

More Telugu News