: సీబీఐ వలలో రైల్వే ఇంజినీర్
గ్యాంగ్ మన్ నుంచి రూ.5 వేలు లంచం స్వీకరిస్తున్నఓ రైల్వే సెక్షన్ ఇంజినీర్ సీబీఐ వలలో చిక్కుకున్నాడు. ప్రకాశం జిల్లా గిద్దలూరు రైల్వే స్టేషన్ లో బి.లక్ష్మీనారాయణ సెక్షన్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. అయితే, గ్యాంగ్ మన్ బాషా నుంచి లంచం స్వీకరిస్తూ విశాఖపట్నం సీబీఐ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ తెల్లవారుజామున లక్ష్మీనారాయణ నివాసంపై దాడిచేసిన అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఇంజినీర్ ను అరెస్టు చేసి విశాఖ కోర్టులో హాజరుపరుస్తామని సీబీఐ తెలిపింది.