: అక్కడ గ్యాస్ పైప్ లైన్ పేలింది... ఇక్కడ గ్యాస్ కొరత ఏర్పడింది


హైదరాబాదులోని గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లలో గ్యాస్ కొరత ఏర్పడింది. నగరం గ్యాస్ పైప్ లైన్ పేలుడు కారణంగా గ్యాస్ కొరత ఏర్పడిందని భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ పేర్కొంది. పేలుడు కారణంగా గెయిల్ గ్యాస్ సరఫరాను నిలిపివేసిందని, దాంతో హైదరాబాదు, కాకినాడ ప్రాంతాలకు గ్యాస్ సరఫరా నిలిచిపోయిందని గెయిల్ తెలిపిందని బీజీఎల్ వెల్లడించింది. అయితే, ప్రత్యేక పైప్ లైన్ వల్ల విజయవాడకు సరఫరా కొనసాగుతుందని బీజీఎల్ తెలిపింది. హైదరాబాదులో సరఫరా ఉన్నంత వరకు గృహ అవసరాలకు గ్యాస్ ను సరఫరా చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. మూడు ఆర్టీసీ ఫిల్లింగ్ స్టేషన్లకు, మరో 15 బీజీఎల్ సీఎన్ జీ ఫిల్లింగ్ స్టేషన్లలోనూ గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం ఉందని బీజీఎల్ పేర్కొంది.

  • Loading...

More Telugu News