: పోచారం శ్రీనివాసరెడ్డితో సమావేశమైన ఇజ్రాయల్ ఎంబసీ ప్రతినిధి బృందం
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో ఇజ్రాయల్ ఎంబసీ ప్రతినిధి బృందం సమావేశమైంది. త్వరలో ఇజ్రాయల్ లో పర్యటించి, అక్కడి వ్యవసాయ పద్ధతులను అధ్యయనం చేస్తామని పోచారం తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో స్వయం సమృద్ధి సాధనే లక్ష్యమని పోచారం పేర్కొన్నారు.