: ఎంసీఐ నుంచి రాష్ట్రానికి 400 సీట్లు కేటాయింపు: మంత్రి కామినేని
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నుంచి రాష్ట్రానికి 400 సీట్లు కేటాయించారని ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యాశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. నెల్లూరుకు 150, తిరుపతికి 50, కాకినాడకు 50 సీట్ల చొప్పున కేటాయించారని ఆయన తెలిపారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి 150 సీట్లను ఎంసీఐ కేటాయించిందని ఆయన చెప్పారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి మెడికల్ కౌన్సిలింగ్ జరిగే అవకాశం ఉందని మంత్రి అన్నారు.