: ప్రపంచ అతిపెద్ద పక్షి శిలాజం దొరికింది!


ఈ పక్షి ప్రపంచంలోనే అతి పెద్దది. ఎంత పెద్దదంటే, ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద ఎగిరే పక్షిగా పేరుగాంచిన రాయల్ ఆల్ బట్రాస్ పరిమాణం కంటే రెండింతలుంటుందట. అంతేకాదండోయ్, ఈ పక్షి రెక్కలోని ఎముక మన చేయి కంటే పొడుగ్గా ఉంటుందట. 20 నుంచి 24 అడుగుల మేర రెక్కలుండే ఈ పక్షి ఒక్కసారి గాలిలోకి ఎగిరిందంటే, ఏకబిగిన సముద్రాలనే దాటేంత దూరం ప్రయాణం చేయగలదు. అయితే సముద్ర ఉపరితలంపై ఎగురుతూనే కాస్త కిందకు దిగి అత్యంత సున్నితంగా ఉండే తన రెక్కల ఈకలను, దేహాన్ని సముద్రపు నీటితో తడుపుకుంటూ వెళుతుందట. 'పెలగార్నిస్ సాన్ డెర్సి' పేరుగల ఈ పక్షి 2.5- 2.8 కోట్ల ఏళ్ల క్రితం భూమిపై ఉండేదట. డైనోసార్లు అంతరించిన తర్వాత మానవుడి సంచారానికి చాలాకాలం ముందుగా ఈ పక్షులు ఉండేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దక్షిణ అమెరికాలోని చార్లెస్టన్ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ కోసం 1983లో జరిపిన తవ్వకాల్లో ఈ పక్షి శిలాజం బయల్పడిందట. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్స్ ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి.

  • Loading...

More Telugu News