: హెచ్ఎన్ఎస్ఎస్ ఈఈ ఇంటిపై ఏసీబీ దాడి
హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ కు సంబంధించి కర్నూలు ఈఈ గా విధులు నిర్వర్తిస్తున్న సుధాకర్ రెడ్డి ఇంటిపై మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. సుధాకర్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఫిర్యాదులు అందుకున్న ఏసీబీ అదికారులు కర్నూలులోని ఆయన ఇంటిలో ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లతో పాటు అధికారులు కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.