: 'మా దేవుడు గొప్పంటే మా దేవుడు గొప్ప అంటూ తగవులాడుకుంటున్నారు'
దేవుడు చెప్పిన సర్వమానవ సౌభ్రాతృత్వం గాలికొదిలేసి... మా దేవుడు గొప్పంటే మా దేవుడు గొప్ప అంటూ తగవులాడుకుంటున్నారని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు. 'విశుద్ధ వేదాంత సర్' అనే గ్రంథాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఇళ్లలో, వీధుల్లో, రాజకీయాల్లో ఉండే గొడవల కంటే దేశంలో దేవుళ్ల గొడవ అధికంగా ఉందని అన్నారు. పీఠాల ద్వారా శంకారాచార్యులు ఏం చెప్పారు? వేదాంత సారం ఏమిటి? అన్నది చెప్పేందుకు ఈ పుస్తకం రచించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ అంశాలను ఉత్తర భారతీయులకు చెప్పేందుకే ఈ గ్రంథాన్ని హిందీలో ఆవిష్కరించానని ఆయన వెల్లడించారు.